ఆ టైంలో అదో సాహసం.. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజుతో చేసిన ప్రయోగం..!
అప్పటివరకు రెగ్యులర్ సినిమాలు చేస్తూ వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సీతారామరాజు కథను తెర మీద చూపించాలని అనుకున్నారు. త్రిపురనేని మహారధి స్క్రిప్ట్ అందించగా వి. రామచంద్రరావు దర్శకత్వం వహించారు. కృష్ణ గారికి అప్పుడున్న మాస్ ఇమేజ్ కు భిన్నంగా అల్లూరి సీతారామ రాజు సినిమా చేశారు. సినిమా చేసే టైం లో సినిమాపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు అయినా సరే అవేమి పట్టించుకోకుండా సినా స్కోప్ లో అల్లూరి సీతీరామరాజు సినిమా చేశారు కృష్ణ.
ఈ సినిమా కోసం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల లో మన్యం ప్రాంతాలకు వెళ్లి మరి అక్కడ వివారాలు సేకరించి అక్కడే షూటింగ్ జరిపారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు చిత్రయూనిట్ కాన్ ఫిడెంట్ గా ఉన్నా కొందరు సినిమాపై విమర్శలు చేశారు. అల్లూరి సీతారామ రాజు విడుదల తర్వాత ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పట్టారు. సినిమాలో సీతారామరాజు డైలాగ్స్ ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిన అవసరం ఉంది. నిజంగా అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అనేలా సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం ఉంటుంది. డౌట్లన్నిటినీ పటాపంచలు చేస్తూ మన్యం వీరుని కథ అల్లూరి సీతారామ రాజు వెండితెర మీద అద్భుత కళాఖండంగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ 350పైగా సినిమాలు చేశారు. వాటిలో అల్లూరి సీతారామరాజు సినిమా ఎప్పటికి ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పొచ్చు.