స్టార్ స్టేటస్ లో వెనకబడ్డ దగ్గుబాటి హీరో..!

shami
దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే లీడర్ నుండి రాబోతున్న విరాటపర్వం వరకు చేసిన సినిమాలన్ని రానాని నటుడిగా పైకి ఎదిగేలా చేశాయి కాని అందరిలా స్టార్ స్టేటస్ తెచ్చుకోవడంలో మాత్రం వెనకపడ్డారని మాత్రం చెప్పొచ్చు. ఈమధ్య ఐదారు సినిమాలు చేసి స్టార్ క్రేజ్ తెచ్చుకుంటున్న హీరోల మధ్య రానాకు అంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా స్టార్ స్టేటస్.. స్క్రీన్ నేం లాంటివి ఎందుకు రావట్లేదు అన్నది అర్ధం కావట్లేదు.

తను ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్న ఈ హీరో స్టార్ స్టేటస్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. నటుడిగా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న రానా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు అని అంటుంటాడు. కేవలం హీరోగానే కాదు విలన్ గా కూడా చేస్తాడు కాబట్టి రానాకి స్టార్ స్టేటస్ రాలేదు అంటున్న వారు ఉన్నారు. బహుశా అది కూడా ఒక కారణం కావొచ్చు కాని విలక్షణ పాత్రలతో సినిమా సినిమాకు కొత్తగా ప్రయత్న్స్తున్న రానా కూడా స్టార్ హీరోగా గుర్తించబడాల్సిందే అని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుతున్నారు.

మొదట్లో మాస్ కథలు.. హీరోయిజం స్టోరీలను ఎంకరేజ్ చేసిన రానా కొత్తగా ఉంటే తప్ప సినిమా చేయకూడదు అనుకుని ప్రయత్నిస్తున్నాడు. అందుకే రానాకు సెపరేట్ స్టార్ క్రేజ్ అనేది రాలేదు. యువ హీరోలతో సమానంగా రానా సినిమాల బజ్ ఉంటుంది. మరి ఈ దగ్గుబాటి హీరో కెరియర్ ఎలా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడో ఏమో కాని ఫ్యాన్స్ మాత్రం రానాని స్టార్ ఇమేజ్ తో చూడాలని అనుకుంటున్నారు. అంతేకాదు రానాకి సరైన స్క్రీన్ నేం కూడా కావాలని కోరుతున్నారు. మరి వీరి కోరికలను రానా ఎప్పుడు తీరుస్తాడో చూడాలి. రానున్న సినిమాలతో అయినా రానా ఫ్యాన్స్ కోరిక తీర్చాలని ఆశిద్దాం.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: