ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆగిపోగా లేటెస్ట్ గా ఆదిపురుష్ షూటింగ్ మళ్లీ మొదలైందని తెలుస్తుంది. ప్రభాస్ లేకుండానే ఆదిపురుష్ షూటింగ్ చేస్తున్నారట ఓం రౌత్.

ప్రభాస్ ఎపిసోడ్స్ కాకుండా ముందు వేరే సీన్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఆదిపురుష్ కోసం ప్రభాస్ కేవలం 100 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడని టాక్. ఈ 100 రోజుల్లో సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అందుకే ప్రభాస్ లేకుండా సినిమా పోర్షన్ కంప్లీట్ చేసి ప్రభాస్ వచ్చాక మరింత స్పీడ్ గా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ కూడా డైరక్టర్ ప్లాన్ కు ఓకే చెప్పినట్టు టాక్.

ఇక ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినీమ చేస్తున్నాడు. ఈ సినిమాని కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్రభాస్ తొదరపడుతున్నాడని తెలుస్తుంద్. ఇక రాధే శ్యాం సినిమా కూడా కొద్దిపాటి షూటింగ్ పెండింగ్ ఉండగా త్వరలోనే ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది. రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ ఈ మూడు సినిమాలతో ప్రభాస్ తన ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఒకదానికి మించి మరోటి అన్నట్టుగా ప్రభాస్ సినిమాలన్ని ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమాలతో మరోసారి రికార్డుల మీద కన్నేశాడు ప్రభాస్. తప్పకుండా ఈ మూడింటిలో ఏదో ఒకటి రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: