రెబల్ స్టార్
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా దూసుకుపోతున్నాడు.
బాహుబలి సినిమా తో పెద్ద పాన్
హీరో అయ్యాడు. ఇక
కాజల్ కూడా తెలుగులో పెద్ద స్టార్
హీరోయిన్ గా రాణించింది. ఇక ఇప్పుడు తన మిత్రుడు
గౌతమ్ కిచ్లుని ప్రేమించి
పెళ్లి చేసుకుంది.
ప్రభాస్ మాత్రం ఇంకా సింగిల్ గానే వుండిపోయాడు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిన సంగతి తెలుసా..అప్పుడు వీరి మధ్య ఏదో ఉందని గాసిప్పులు పుట్టుకోచ్చాయి.
ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకర్ దర్శకత్వంలో "డార్లింగ్"
సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో
ప్రభాస్,
కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఆ
సినిమా టైములో వీరిద్దరూ ప్రేమించుకున్నారని వార్తలు వచ్చాయి.
ప్రభాస్
కాజల్ ని
పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ టైములో
మీడియా కోడై కూసింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి దసరధ్ దర్శకత్వంలో "మిస్టర్ పర్ఫెక్ట్"
సినిమా కూడా చేశారు.ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరూ ప్రేమలో వున్నారని త్వరలో
పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకోచ్చాయి.కాని ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకపోవడతో జనాలు కొన్నాళ్ళు నమ్మిన కాలక్రమేణా వీరి వ్యవహారం గురించి మరిచిపోయారు. తరువాత వీరిద్దరూ ఎవరి సినిమాలతో వారు తీరిక లేకుండా బిజీ అయిపోయారు. దెబ్బకి వీరి
ప్రేమ వార్త ఒక రూమర్ గానే మిగిలిపోయింది.ఇక ఆ తరువాత
కాజల్ వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. పెద్ద స్టార్
హీరోయిన్ అయ్యింది.
ప్రభాస్ కూడా సుధీర్ఘ కాలం పాటు 'బాహుబలి'
సినిమా కోసం తన సమయాన్ని కేటాయించి ఇప్పుడు పెద్ద పాన్
ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ లాంటి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.