మరో కొత్త అవతారం ఎత్తబోతున్న నిహారిక.. ఎవరికోసమంటే ?

VAMSI
మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రతిభతో సినీ పరిశ్రమలో తనకంటూ కొత్త బజ్ ను క్రియేట్ చేసుకుంది. తొలుత యాంకరింగ్ తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ అందాలనటి అనంతరం "ఒక మనసు" సినిమాతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాలలో నటించింది. కాగా గత ఏడాది డిసెంబర్ మాసంలో ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక కల్యాణం జరిగింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈమె కెమెరాకు పూర్తిగా గుడ్ బై చెప్పనుంది అంటూ చాలా వార్తలు వినిపించాయి. కానీ వాటన్నిటినీ తోసిపుచ్చుతూ నిహారిక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా సందడి చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

అంతే కాకుండా ఇటీవలే ఓ నూతన వెబ్ సిరీస్ కి కూడా నిహా సైన్ చేసిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం వెండితెరకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మాత్రం తన జోరు చూపిస్తూనే ఉంది ఈ మెగా డాటర్.  తాజాగా ఈమె గురించి మరో లేటెస్ట్ అప్డేట్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈమె మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేయబోతుంది అంటూ ఊహాగానాలు వినపడుతున్నాయి. గతంలో "డీ జూనియర్స్" షోకు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను మెప్పించిన నిహారిక, ఇప్పుడు మరోసారి తన మాటల సవ్వడితో ప్రేక్షకుల మదిలో వీణలు మోగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బుల్లితెరపై కామెడీ షోలు బాగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈమె వ్యాఖ్యాతగా చేయబోతున్న షో కూడా కామెడి ప్రధానంగా ఉండే షో అని ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం. ఈ షో మా టీవి లో ప్రసారమయ్యే అవకాశం ఉందని  సినీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాట. అయితే మన సూర్యకాంతం బుల్లితెరపై కామెడీ షో లో కనిపించ  నుందో ?  లేదో ? తెలియాలంటే, మా టీవీ యాజమాన్యం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: