సినీనటి రోజారమణి తనయుడుగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన
తరుణ్ బాల నటుడిగా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మొదటి విజయాన్ని "నువ్వేకావాలి" తో అందుకున్నాడు. అప్పట్లో ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత వరుసగా నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు వంటి ఘనవిజయాలతో టాప్
హీరో రేంజ్ కి ఎదిగాడు. అప్పట్లో
తరుణ్ అంటే ఒక యూత్ ఐకాన్. యువత మనసుకు చేరువయ్యేలా కథలు ఎంచుకుంటూ తనదైన శైలిలో నటనను కనబరిచి క్రేజ్ ను పెంచుకున్నాడు.
తరుణ్ తో మాట్లాడాలంటే కాస్త ఆలోచించి మాట్లాడాలి అని అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా కౌంటర్ వేస్తే తిరిగి వెంటనే
తరుణ్ ఎన్ కౌంటర్ లు వెల్లువెత్తుతాయని ఆయన సన్నిహితులు అంటుంటారు.
ఎక్కువగా ప్రేమకథా చిత్రాలను ఎంచుకునే ఈ హీరోని ప్రేక్షకులు లవర్ బాయ్ గా ఆరాధించారు. ఇలా వరుస అవకాశాలతో కెరియర్ మంచి స్పీడ్ లో ఉండగానే అనూహ్యాంగా చతికల పడ్డాడు ఈ హీరో. అయితే ఇలా ఒక్కసారిగా తన ఇమేజ్ తగ్గిపోవడానికి కారణాలు ఇవే అంటూ అప్పట్లో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తన ప్రొఫెషన్ పై సరైన నిబద్ధత లేదని, చాలా ఇమేజ్ ఉందనే గర్వం ఆయనకు ఎక్కువ అని, షూటింగ్స్ కి సమయానికి రాకుండా షెడ్యూల్ మిస్ అయ్యేలా చేసేవారని చాలా కథనాలు వినిపించాయి.
ఆర్తి అగర్వాల్ తో తన
ప్రేమ వ్యవహారం అంతే కాకుండా శ్రుతి మించడం అది కాస్త తల్లి
రోజా రమణికి తెలియడం ఆమె గట్టి వార్నింగ్ ఇవ్వడంతో
ఆర్తి అగర్వాల్ ని దూరం పెట్టాడని పుకార్లు వచ్చాయి.
దాంతో
ఆర్తి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి తన కెరీర్ నే నాశనం చేసుకుంది. దీనికంతటికి కారణం
తరుణ్ అంటూ ఈ హీరోపై సినీ ఇండస్ట్రీలో ఒక నెగటివిటీ ఏర్పడింది. ఇలా మొత్తానికి
సినిమా ఇండస్ట్రీ అంతా
తరుణ్ ని బ్లాక్ చేసింది. ఆలా
తరుణ్ తన వైఖరితో విజయ గర్వంతో వ్యవహరించడమే ఈ అపరిస్థితికి కారణమని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నో రూమర్స్ మరియు వరుస ఫ్లాపులు కలసి
తరుణ్ కి పెద్ద మైనస్ లుగా మారాయి. కాగా ప్రస్తుతం ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మళ్ళీ మెల్ల మెల్లగా క్లిక్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇంతకు ముందులా
తరుణ్ సినిమాలు చేసి ఆదరిస్తాడా చూడాలి.