పవన్
కళ్యాణ్ ను అతడి అభిమానులు ‘పవర్ స్టార్’ అని పిలుచుకుంటూ ఉంటారు. అభిమానుల దృష్టిలో పవన్ దేవుడు అందుకే
హరీష్ శంకర్ పవన్ కు అభిమానులు ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అంటూ అనేకసార్లు చెప్పాడు. పవన్ భక్తుల జాబితాలో
నిర్మాత నటుడు
బండ్ల గణేష్ చాలముందు వరసలో ఉంటాడు.
పవన్
సినిమా ఫంక్షన్స్ లో
వేదిక ఎక్కితే చాలు
బండ్ల గణేష్ తన ఉపన్యాసంలో ఆవేశంతో ఊగిపోతూ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం అతని అలవాటు. అతడి మాటలు విని జనం నవ్వుకుంటూ ఉన్నా అతడు పట్టించుకోడు. ఇలాంటి పరిస్థితులలో ఈ బ్లాక్ బష్టర్
ప్రొడ్యూసర్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
ఇన్నాళ్లూ పవన్ ను దేవుడిగా పిలిచానని ఇకపై ‘దేవర’ అని పిలుస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘నా దేవరతో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరుడిని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈ రోజు నుంచి నా బాస్ ని ‘దేవర’ అని పిలుస్తాను’ అంటూ సోషల్
మీడియా పేజ్ లో కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు బలం చేకూర్చే విధంగా
బండ్ల గణేష్ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు పవన్ తో కలిసి తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
బండ్ల గణేష్ చేసిన ఈకామెంట్ క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు కూడ ఈ కామెంట్ కు
ఖుషీ తో ఉండి
బండ్ల గణేష్ ను అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే పవన్
కళ్యాణ్ తో ఎప్పుడు
సినిమా మొదలుపెడతావు అంటూ కామెంట్స్ కూడ చేస్తున్నారు. వాస్తవానికి ఈ
నిర్మాత పవన్
కళ్యాణ్ తో
సినిమా తీయడానికి గత కొంత కాలంగా చాల ప్రయత్నిస్తున్నాడు. అయితే పవన్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి స్పందన తెలుపక పోవడంతో అభిమానుల నుంచి పవన్ పై ఒత్తిడి తీసుకు రావడానికి ఈ బ్లాక్ బష్టర్
నిర్మాత ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాడు అనుకోవాలి..