ఉదయ్ కిరణ్ ఆగిపోయిన 10 సినిమాలివే...!!
ఇక బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పటి హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల సినిమాను తెరకెక్కించాలనుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సౌందర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక ఈ చిత్రంలో అభిమాన్యుడి కోసం ఉదయ్‌కిరణ్‌ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది.
అలాగే సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాకు తీయాలని అనున్నారంట. అంతేకాదు.. ఈ సినిమాకు లవర్స్ అనే టైటిల్ ని పెట్టారంట. అయితే ఏమైందో తెలియదు కానీ.. ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. ఇక అంజనా ప్రొడక్షన్స్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా ఓ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు.
ప్రత్యూష క్రియేషన్స్ లో ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ఓ సినిమాను చేయాలనీ అనుకున్నారు. అందుకోసం ప్రకటన కూడా ఇచ్చారు. ఈ సినిమా కూడా అనుకోకుండా ఆగిపోయింది. చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ఏఎం రత్నం నిర్మాణంలో ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఆగిపోయింది.
ఇక ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ చిత్ర సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోవడంతో ఈ సినిమాను స్టాప్ చేశారు. షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్ తెలుగులో రీమెక్ చేయాలనుకున్నారు. అందులో ఉదయ్ కిరణ్, త్రిష హీరోహీరోయిన్లుగా చేయడానికి సన్నాహాలు కూడా జరిగాయి. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. ఎంఎస్ రాజుతో ఉదయ్ కిరణ్ ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అది కూడా ఆగిపోయింది. తేజ ఉదయ్ కిరణ్ తో మరో సినిమాను చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఉదయ్ చనిపోయారు.