మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!
ఆచార్య సినిమాకు మరో 12 రోజుల షూటింగ్ తో షూటింగ్ పూర్తవుతుందట. అనుకున్న విధంగా ఆ టైం కు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ ప్రకటించాలని చూస్తున్నారు. మొన్నటివరకు కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడ్డది. ఇక ఇప్పుడు 12 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట డైరక్టర్ కొరటాల శివ. సినిమా షెడ్యూల్ పూర్తయితే అక్టోబర్ కల్లా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. లాక్ డౌన్ వల్ల సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి.
చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ కు పూజా హెగ్దే జోడీగా నటిస్తుంది. సినిమాలో చరణ్ పాత్ర ఉన్న కొద్దిసేపైనా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఆచార్య ఇంటర్వల్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని చెబుతున్నారు. సైరా తర్వాత చిరు ఆచార్యతో హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్నారు. చిరు కూడా లూసిఫర్ రీమేక్ గా వస్తున్న సినిమాతో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఇవే కాకుండా మెహెర్ రమేష్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.