ప్రభాస్ ,అనుష్క ఈ ఇద్దరికీ విడివిడిగా స్టార్ ఇమేజ్ వున్నప్పటికీ, ఈ రెండు పేర్లు కలిపి వినిపిస్తే వచ్చే క్రేజే వేరు. టాలివుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ లిస్టులో
ప్రభాస్ పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాహుబలికి తగ్గ అరుంధతిగా
అనుష్క అయితేనే అన్ని విధాలుగా ఈడుజోడు బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆకాంక్షిస్తున్నారు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఫ్యాన్స్ బయటికి చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి, బిల్లా,
బాహుబలి సినిమాలు
బ్లాక్ బస్టర్ గా నిలిచి,
డార్లింగ్ మరియు
స్వీటీ ల కాంబినేషన్ సూపర్ లక్కీ జంటగా పేరు తెచ్చుకున్నాయి. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న వీరిద్దరూ
బాహుబలి సినిమా తర్వాత మరో సినిమాలో నటించనే లేదు. దీనికి పలు కారణాలు వినబడుతున్నాయి. అవేంటో ఇప్పుడు ఓ సారి చూద్దాం..
ప్రభాస్,
అనుష్క లు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్ షిప్ లో ఉన్నారని,
పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని ఇలా వీరిపై గాసిప్ లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఈ తరహాలో వార్తలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందించిన
అనుష్క,
ప్రభాస్ లు అలాంటిదేమీ లేదని, వీరి మంచి స్నేహితులు మాత్రమేనని గంటా పదంగా పలుమార్లు చెప్పినా రూమర్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. దానితో విసుగు చెందిన వీరిద్దరు ఇకపై కలసి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే హిట్ పెయిర్ గా టాక్ తెచ్చుకున్న ఈ జంట ఈ మధ్య అసలు సినిమాలు చేయడం లేదని వార్తలు వినబడుతున్నాయి. ఇదే కనుక నిజమయితే ఇకపై వీరిద్దరూ తెరపై కనిపించడం కష్టమేనని తెలుస్తోంది.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ వీరి కాంబోలో మరో
సినిమా కోసం అభిమానులు పడిగాపులు కాస్తున్నారు. మరి కనీసం అభిమానుల కోసం అయినా
డార్లింగ్, స్వీటీలు మరో
సినిమా చేస్తారేమో చూడాలి. కాగా
బాహుబలి సెకండ్ పార్ట్ తరువాత
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి మరియు నిశ్శబ్దం సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు
అనుష్క కెరీర్ సాఫీగా సాగాలంటే సరైన హిట్ అవసరం.