భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..?
ఇందుకోసం ఆయన తన సొంతంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. కరోనా చికిత్సలో భాగమైన వైద్య సామాగ్రి కోసం ఆయన మరో 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చిరు టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎవరూ చేయలేనంత సాయం చేసి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఆయన గత నాలుగు శతాబ్దాలుగా ప్రకృతి విపత్తులలో బాధితులైన ప్రజలకు సాయం చేస్తున్నారు.
అయితే చిరంజీవి తన జీవిత కాలంలో ఇచ్చిన విరాళాల విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంటుంటారు. 1998 నుంచి చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్స్ నడుపుతున్నారు. 1988వ సంవత్సరంలో పంటలు బాగా దెబ్బతిని తీవ్రంగా నష్టాలు రావడంతో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోయిన రైతు కుటుంబాలకు చిరంజీవి అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం చేశారు. చిరంజీవి ఇంకా మరెన్నో గుప్తదానాలు చేసి ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు.
అయితే బ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి ఆరు కోట్ల వరకు అవుతుందని సమాచారం. 90 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలోకి తొంగి చూస్తే.. చిరంజీవి లాగా ఎవరూ కూడా వందల కోట్ల రూపాయల్లో దానం చేయలేదని తెలుస్తోంది. చిరంజీవి స్థాపించిన ఐబ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షలమంది పేషెంట్లు లబ్ధి పొందారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు "బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంకు" గా నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవార్డు గెలుచుకుంది.