కింగ్ ఖాన్ ఎంట్రీ కోసం తాపత్రయపడుతున్న అభిమానులు...

Purushottham Vinay
ఇక  కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ కింగ్ గా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పటికి తన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తన నుంచి రాబోయే చిత్రాల గురించి అప్‌డేట్ కావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక షారుఖ్ ఖాన్ బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇందులో కింగ్ ఖాన్ లుక్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తుండటంతో,ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఇక షారుఖ్ ఖాన్ అభిమానులతో 'ASK SRK' సెషన్‌లో ముచ్చటించాడు.


శుక్రవారం షారూఖ్ ఖాన్ ముచ్చట్లు అభిమానులందరికీ విందుగా నిలిచింది. సినీ పరిశ్రమలో తన 29 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ నటుడు ఈ గత సంవత్సరాల్లో నటుడిగా అతని చిత్రాల పట్ల అమితమైన ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించాడు.ఇక షారుఖ్ వారికి థాంక్స్ నోట్ పంచుకున్నాడు. ఇక ఆ తరువాత, అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 'ASK SRK' సెషన్ నిర్వహించాడు.ఇక అభిమానులు షారుఖ్ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని తెలిపారు అభిమానులు.."మీ రాబోయే చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది?" అని ఓ అభిమాని ప్రశ్నించారు. ఇక షారుఖ్ "ప్రస్తుతం పరిస్థితులతో, కొంచెం ఓపికతో సినిమా విడుదల షెడ్యూల్ చేయడం వివేకం అని నేను భావిస్తున్నాను" అని అన్నారు. తన రాబోయే చిత్రం పఠాన్ గురించి అప్‌డేట్ కావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రశ్న అడిగారు అభిమానులు. ఇక దానికి ఈ విధంగా షారుఖ్ జవాబు ఇచ్చాడు.ఇక పఠాన్ సినిమా ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.



https://twitter.com/iamsrk/status/1408305432418865155?s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: