బూరె బుగ్గల అమ్మాయి
హీరోయిన్ పూర్ణ అవును, అవును 2,
సీమటపాకాయ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయం అద్భుతమైన నటన ఈమె సొంతం. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ స్టార్
హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో అందరూ ఈమెను త్వరలోనే టాప్
హీరోయిన్ గా ఎదుగుతుందని ఊహించారు. కానీ అందివచ్చిన అవకాశాలు, అదృష్టం పెద్దగా కలిసి రాకపోవడంతో ఆ అంచనాలకు చేరుకోలేకపోయింది. అయితే ఇటీవల "ఢీ" డ్యాన్స్ షో తో మళ్లీ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ
కేరళ కుట్టి. ఇటీవలే 2021
జూన్ లో విడుదలైన పవర్ ప్లే
మూవీ లో విలన్ గా దర్శనమిచ్చింది పూర్ణ.
రాజ్ తరుణ్ ప్రధానపాత్రలో విజయ్
కుమార్ కొండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన
పూర్ణ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రం జయాపజయాలను పక్కన పెడితే ఈ సినిమాలో విలన్ గా
పూర్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందమైన లేడీ విలన్ గా, అబ్బురపరిచే నటనతో ప్రేక్షకులను అలరించింది పూర్ణ. అలా నెగిటివ్ పాత్ర చేసి తనలోని మరో యాంగిల్ ను బయట పెట్టింది ఈ అందాల భామ. పవర్ ప్లే
మూవీ లో
పూర్ణ అద్భుతమైన నటనను చూసిన ఒక
డైరెక్టర్ తన నెక్స్ట్
మూవీ లో విలన్ పాత్రకు ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పేరుకు విలన్ అయినా ఆమెను మరింత అందంగా, గ్లామర్ గా చూపిస్తూ విలనిజం కు కొత్త హంగులు దిద్దాలని యోచిస్తున్నాడట ఆ దర్శకుడు.
ఈ
సినిమా ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేసినట్లు సమాచారం. రాజకీయ అంశంపై ఈ
సినిమా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా ఇప్పటికే నటి
పూర్ణ ఈ
సినిమా కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కావాల్సి అయ్యే అవకాశం ఉంది.