రీసెంట్‌గా వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూతో మరోసారి రచ్చ రచ్చ చేసింది బిగ్ బాస్ బ్యూటీ అరియనా. ఇక జిమ్ములో పొట్టి బట్టలతో పిచ్చెక్కిస్తూ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తూ పచ్చి నిజాలను బయట పెట్టించింది. ‘అరియానా బోల్డ్ టాక్ విత్ ఆర్జీవీ’ అంటూ ఇద్దరూ కలిసి బోల్డ్ మాటలతో వీక్షకులను పిచ్చెక్కించారు. ఇక దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. కాని వీడియోకి భారీ స్పందన వచ్చినప్పటికీ కొంతమంది మాత్రం ఈ వీడియో చూసి తీవ్రంగా విమర్శించారు. కూతురు వయసున్న అమ్మాయితో ఇలాంటి ఇంటర్వూస్ ఏంటి? అని కొందరు కామెంట్ చేశారు.అందుకే ఈ నేపథ్యంలో తాజాగా ఈ బోల్డ్ ఇంటర్వ్యూ గురించి అరియానా రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీన్ని చూసి బోల్డ్ ఎందుకంటున్నారో..ఈ ఇంటర్వ్యూ లో బోల్డ్ ఏముందో తనకైతే అర్థం కావడం లేదని చెప్పింది.నిజానికి ఈమెను ఫేమస్ చేసింది ఆర్జీవీనే.
గతంలో ఓ ఇంటర్వ్యూలో నేరుగా అరియానా ఫిగర్‌పై కామెంట్ చేసి అందరి దృష్టి ఈమెపై పడేలా చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం,నీ తొడలు అంటే ఇష్టం, నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అని రామ్ గోపాల్ వర్మ అనడంతో ఒక్కసారిగా సాధారణ యాంకర్ గా వున్న అరియానా పాపులర్ అయ్యింది.అలా ఏకంగా బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం దక్కించుకొని బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో హాట్ టాపిక్ అయింది.తాజాగా ఈ ఇంటర్వ్యూపై స్పందించింది ఈ హాట్ బ్యూటీ.
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా,అలాగే పదికాలాల పాటు కెరీర్‌ను కొనసాగించాలన్నా తప్పకుండా కాంప్రమైజ్ అవ్వాలని అరియానా చెప్పడం విశేషం.ఇక ఈ ఫీల్డ్‌లో విజయం సాధించాలంటే ఎవరేమన్నా కోపగించుకోకూడదని, కోపం వల్ల సాధించేదేమీ లేదు కాబట్టి కాంప్రమైజ్ బెటర్ అని ఆమె తెలిపింది. అలాగేఆమెని ట్రోల్ చేస్తున్న వారు తాను ఫేమస్ అయ్యేందుకు మాత్రమే అలా చేస్తున్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. కొందరైతే ఎవరూ ఈమెని పట్టించుకోవట్లేదని అందుకే అవకాశాల కోసం ఇలా వర్మని వాడుకొని ఇలాంటి హాట్ ఇంటర్వూలు చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు.