ట్రెండింగ్ స్టైల్‌లో మెస్మ‌రైజ్ చేస్తున్న లైగ‌ర్ బ్యూటీ...?

Suma Kallamadi
బాలీవుడ్‌లో త‌క్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య పాండే. ఇప్పుడామె రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా లైగ‌ర్‌తో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అనన్య పాండే. సౌత్ టు నార్త్ వ‌ర‌కు ఈ అమ్మడికి భారీగా పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాల్లోనూ అనన్య పాండేకు మిలియ‌న్ల‌లో ఫాలోయింగ్ ఉంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యే భామగా అనన్యకు పేరుంది. అదే యూత్‌లో అంతకంతకు ఫాలోయింగ్ తెచ్చిపెడుతోంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఇండీ కిడ్ స్టైల్స్ ని అంద‌రికీ తెలిపిన భామగా చర్చల్లోకొస్తోంది.  ఇప్ప‌టి త‌రం ఫ్యాషన్ ఫాలోయింగ్‌లో ఇండీ కిడ్ బ్యూటీ చెప్పుకోదగ్గదిగా పేరుంది.

అయితే ఈ ట్రెండ్ వ్యక్తిత్వం స్వాతంత్య్రం పై ఆధారపడి ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇండీ కిడ్ అనేది ప్రకాశవంతమైన రంగురంగుల స్టైల్ గా పేరుగాంచిన ట్రెండ్‌. సాధారణంగా పెద్ద జీన్స్ లేదా పెద్ద హూడీలు చిన్న చొక్కాలు వేసుకోవ‌డం ఒకింత ట్రెండింగ్ గా ఉంటే టిక్ టాక్ ద్వారా ఇండీ బ్యూటీ బాగా పాపులరైంద‌ని చెప్పాలి.

అయితే ఇప్పుడు అందమైన బకెట్ టోపీలు ఫ్యాషన్ ప్రపంచంలోకి తిరిగి వచ్చి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సెలబ్రిటీల నుండి మోడల్స్ దాకా అంద‌రూ ఈ బకెట్ టోపీల‌ను వాడుతున్నారు. బకెట్ టోపీ లేకుండా ఇండీ కిడ్ లుక్ సంపూర్ణంగా ఉండ‌ద‌నే చెప్పాలి. 2000ల సంవ‌త్స‌రంలో ఇవి భారీ ట్రెండింగ్ గా అప్ప‌ట్లో మారాయి.అయితే ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు  మరోసారి తమ స్వంత ఆధునిక మార్పులతో తిరిగి అదే ఫ్యాషన్ ని తీసుకొచ్చారు కంపెనీ య‌జ‌మానులు. స్కూల్ యూనిఫాంలో భాగమైన స్కర్టులను గుర్తుగా వేసుకుంటే.. అవే డ్రెస్సులు ఇప్పుడు ఇండీ లో లేటెస్ట్ ఫ్యాషన్ గా అవ‌త‌రించాయి. ఇక పాఠశాల నుండి స్ఫూర్తితో టెన్నిస్ స్కర్టులను ఎంపిక చేసుకోవడమే ఇప్ప‌టి ఇండీ స్టైల్ లో మెయిన్ రోల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: