అందరిలోనూ క్రేజ్ ను కలిగిస్తున్న కీర్తి సురేష్ సూర్యదేవ ఆరాధన !
కీర్తి సురేష్ సూర్యనమస్కారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షేర్ చేసిన సూర్యనమస్కారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య నమస్కారాలలో ఉండే 12 ఆసనాలను అత్యంత క్లిష్టమైన వివిధ భంగిమలలో సూర్య నమస్కారాలను చేస్తూ షేర్ చేసిన ఈ వీడియో చూసిన వారు కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తన ఇంటి పై సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తూ రెడ్ టాప్ మెరూన్ బోటమ్ వేసుకుని తనకు ఇష్టమైన తన పెంపుడు కుక్కను తన పక్కన పెట్టుకుని కీర్తి చేసిన ఈ సూర్య నమస్కారాల వీడియో చూసిన వారికి ఫిజికల్ ఫిట్ నెస్ పై కీర్తికి ఉన్న శ్రద్ధ అర్ధం అవుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రపంచ వ్యాప్తంగా మన యోగా గురించి ప్రజలు మళ్ళీ గుర్తించేలా చేసింది.
సింగపూర్ మలేషియా లాంటి దేశాలలో కూడ అక్కడి ప్రజలు మన సూర్య నమస్కారాల విలువలు గుర్తించి అక్కడ కూడ ఈ ఈ సూర్యనమస్కారాల విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు పక్కన ‘సర్కారు వారి పాట’ లో నటిస్తోంది. ఈ మూవీ కోసం తన పద్ధతులను పక్కకు పెట్టి గ్లామర్ సీన్స్ కు ఓకె చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె నటించిన మరో మూవీ ‘గుడ్ లక్ సఖీ’ మూవీ త్వరలో ఓటీటీ బాట పట్టబోతోంది. ఈమెకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ కుతగ్గ స్థాయిలో హిట్స్ రావడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..