హీరో అర్జున్ భార్య బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందిగా..
హీరో అర్జున్ ఒకప్పుడు అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఒకే ఒక్కడు సినిమాలో ఒక రోజు సీఎం పాత్రలో కూడా నటించి, మన టాలీవుడ్ హీరోలకు రోల్ మోడల్ కూడా అయ్యారు. ఇక తెలుగులో స్టార్ హీరో జగపతిబాబు సరసన హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా హీరో అర్జున్ గారి భార్య గురించి ప్రస్తుతం ఒక టాపిక్ వైరల్ గా మారింది ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. అర్జున్ భార్య నీతూ ఎవరు అని..ఆమె ఎవరో కాదు స్వయానా కన్నడ నటుడు రాజేష్ గారి కుమార్తె. ఇక కన్నడలో మంచి హిట్ అందుకున్న నటుడు రాజేష్. ఇక అర్జున్ కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన దివంగత శక్తి ప్రసాద్ కుమారుడు. ఇక వీరిద్దరూ కూడా మంచి నటులు అని చెప్పవచ్చు. 1988లో విడుదలైన డాక్టర్ గారి అబ్బాయి చిత్రంలో అర్జున్ అలాగే నీతులు ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. అలా అక్కడ వీరి పరిచయం మొదలైంది.
ఇక ఈ చిత్రంలో ఒకరినొకరు ప్రేమించుకొని, ఇక అదే సంవత్సరంలో ఫిబ్రవరి 8వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పట్లో వీరి పెళ్లికి కైకాల సత్యనారాయణ, గిరిబాబు, శరణ్య, దర్శకులు కె.ఎస్.ఆర్.దాస్, రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ఎస్ పీ వెంకన్న బాబు, ఇక గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం, గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, రాధిక, కోట శ్రీనివాసరావు ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరు కావడం విశేషం.ఇక నీతూ అసలు పేరు నివేదిత. ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు ఒకరు ఐశ్వర్య మరొకరు సంజన . 2013వ సంవత్సరంలో ఐశ్వర్య సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే.