కొత్త అవతారం ఎత్తిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తనదైన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక ఈ మధ్యకాలంలో తమన్ భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం 10కి పైగా సినిమాలకి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫోటోగ్రాఫర్ గా మారారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్ ఫోటోగ్రాఫర్ గా మారేంత టైం అతనికి ఎక్కడ ఉంది అని సందేహాలు అందరికి తలెత్తున్నాయి. అయితే నిజానికి తమన్ ఫోటో గ్రాఫర్ గా మారలేదు. ‘అల’ వ్యవహరించాడు అంతే.



తమన్ సోషల్ మీడియా ఖాతాను ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఇటీవల కాలంలో అతను.. సినిమా సెట్స్ లో ఉన్న హీరోలను దర్శకులను అద్భుతంగా ఫోటోలు తీశారు. ఈ ఫోటోలను తమన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని అభిమానులతో పంచుకున్నాడు. అయితే రీసెంట్ గా తమన్ హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమన్ కి ట్విట్టర్ ఖాతాకి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఇక ఈ ఫొటోలో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తున్న ఫోటోకి అతని అభిమానులు తెగ లైక్ లు కొడుతున్నారు. ఇక ఆ ఫోటోపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫోటో కూడా ఆయన అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు ‘అల వైకుంఠపురంలో’ మూవీ సెట్స్ లోని ఫోటోలను స్పష్టంగా అర్ధమవుతుంది. అంతేకాదు.. వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ల రేర్ పిక్స్ ను కూడా తమన్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: