ఉదయ్​ కిరణ్ ‘చిత్రం.. ది పిక్చర్' @ 21ఏళ్లు ..!

Suma Kallamadi
ఉద‌య్ కిర‌ణ్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిత్రం సినిమాతో తెలుగు రొమాంటిక్ కామెడీ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కొత్త‌‌‌‌, పాత ఆర్టిస్టులతో రూపుదిద్దుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నెల ప‌దిహేను రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అప్ప‌ట్లోనే సెన్సేషన‌ల్ విజ‌యం సాధించింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ తోపాటు చిత్రం శీను మ‌రియు ఇత‌ర ఆర్టిస్టుల‌కు ఇది మంచి బ్రేక్ ఇచ్చింది.
 

అయితే ఉదయ్ కిరణ్ కంటే ముందు వేరే వ్య‌క్తిని హీరోగా అనుకున్నాడట క్రియేటివ్ డైరెక్టర్ తేజ. కానీ ఉదయ్ కిరణ్ ను మాత్రం హీరో ఫ్రెండ్ గా  ఓ క్యారెక్టర్ గా అనుకున్నాడు. కాక‌పోతే హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గిపోవ‌డంతో ఉదయ్ కిర‌ణ్‌కు హీరోగా అవ‌కాశం వ‌చ్చింది. ఇక్క‌డ ట్విస్టు ఏంటంటే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో ఉదయ్ కిర‌ణ్‌ను మళ్లీ ఫ్రెండ్స్ లిస్టులో చేర్చారు.

కానీ షూటింగ్ టైమ్‌కు మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకున్న తేజ ఉదయ్ కిరణ్ నే హీరోగా ఫైనల్ చేస్తూ సినిమా తీశాడు. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్కాస్త తడబడడంతో సీరియ‌స్ అయిన తేజ పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడంట. ఇక ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తేజ కావాల్సినట్లుగా న‌టించ‌డం, సినిమా సూపర్ హిట్ కావడం చ‌క‌చ‌కా జరిగిపోయానని తేజ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

అయితే సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడు అయిన రమణ అలాగే ఫారిన్ రిటర్ని అయిన జానకీ ఇద్ద‌రు టీనేజ‌ర్లు కావ‌డం, వీరిద్ద‌రి మ‌ధ్య ప్రణయగాథే  చిత్రం సినిమా. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ప్ర‌జెంట్ చేశాడు తేజ‌. అలాగే కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటివి ఉండేలా చూసుకున్నాడు.  ఇది ఉద‌య్‌కు బాగా క‌లిసొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: