విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ఎదిగాడు. తన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పాత్ర ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు విజయ్. ఈ సినిమాలో చేసినప్పుడు విజయ్ అంటే కూడా ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజు విజయ్ దేవరకొండ అనే పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకే ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు.
సినీ లవర్స్‌ను తనవైపు తిప్పుకుని రౌడీ బాయ్ గా ముద్ర వేసుకున్నాడు. ఆయన ఓవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వ్యాపారంలోనూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే మూవీలో బాలీవుడ్లో దుమ్మురేపడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయ్ సోషల్ మీడియాలో ఎక్కడలేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఇండియా సెకండ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు విజయ్.
ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలతో ఏటా క్యాలెండర్ విడుదల చేసే డబూ రత్నాని ఇప్పుడు విజయ్‌ని కూడా తన కెమెరాలో క్లిక్ మనిపించాడు. 2020-2021 క్యాలెండర్లో కనిపించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ పేరు నమోదైంది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్‌గా అవుతోంది.
స్టైలిష్ లుక్‌లో బైక్‌పై విజయ్ దిగిన ఫొటోను చూసి ఆయన అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారంటే నమ్మండి. మరి లైగర్ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయాలనుకుంటున్న విజయ్‌కి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడలి. ఏదైమైనా విజయ్ చాలా తక్కువ టైమ్‌లోనే దూసుకుపోతున్నారు. త్వరలోనే సుకుమార్‌తో కూడా మూవీ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.