సోనూ అతి పెద్ద డ్రీమ్ అదేనా..?
ఇక ఆయన వసల కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించడం దగ్గరి నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. ఇప్పటి దాక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి ఆయన సేవలు. ఇక ఇప్పుడున్న సెకండ్ వేవ్ లో మందులు సరఫరా చేయడంతో పాటుగా ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్లను, ఆసుపత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేయడం దాకా ఎన్నో విధాలుగా సేవలందిస్తున్నాడు సోనూసూద్. సోనూ సేవలకుగానూ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలనే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్.
ఇంతలా సేవలు అందిస్తున్న మన రియల్ హీరో సోనూసూద్ రీసెంట్‌గా తన అతిపెద్ద కల ఏంటో అందరికీ తెలిపాడు. మరి ఈ మధ్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన బిగ్గెస్ట్ డ్రీమ్ గురించి ఈ విధంగా వివరించాడు. అదేంటంటే పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటుగా ఉచిత వైద్యం అందించడమే తన కున్న అది పెద్ద కల అని సోనూ తన మనసులో మాట చెప్పాడు.
ఇందుకోసం దేశంలో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించాలన్నది ఆయనకు ఉన్న అతిపెద్ద ఆశయం అని స్పష్టం చేశారు సోనూ. కాకపోతే ఇది వెంటనే ఇప్పటికి ఇప్పుడు సాధ్యం కాదని అందుకోసం ఏకంగా చాలా కాలం పడుతుండన్నాడు. ఈ కల ఆయన చిరకాల స్వప్నం అని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు తనకలను ఖచ్చితంగా నెర వేరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు మన రియల్ హీరో.