యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్‌లో స్టార్ హీరో క్రేజ్ ఉంది. ఆయన ప్రముఖ వ్యాపారి అయిన నార్నేశ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 2011లో వివాహం చేసుకున్నాఉ. కాగా వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతాం. వీరు కూడా చెకచెకా ఎదిగేస్తున్నారు చిచ్చరపిడుగులు. కాగా ఇద్దరు కొడుకుల తారక్ కి కెరీర్ పరంగా గొప్ప వైభవం, కలిసిరావడం జరిగింది. ఇప్పుడు తారక్ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్నాడు.
కాగా ఈరోజు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరామ్ పుట్టినరోజు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. భార్గవ్ రామ్ 2018 జూన్ 14న ఎన్టీఆర్‌కు రెండో కొడుకుగా జన్మించాడు. ఈ సందర్భంగా తన కొడుకుతో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఫొటోల్ని తారక్ షేర్ చేసుకుని ఆనందం తెలిపాడు.
దీంతో ఈ ఫోటోల్ని కాస్తా యంగ్ టైగర్ అభిమానులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ లెగసీని నడిపించే వారసుడు ఎవరన్న దానిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. మొదటి కొడుకు అభయ్ రామ్ కాస్త నెమ్మది అని, కానీ చిన్నోడు భార్గవ్ రామ్ మాత్రం చాలా స్పీడ్ అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
పెద్దోడ్ కామ్ గోయింగ్ అని, చిన్నోడు మాత్రం తారక్ లాగానే ఫుల్ మాస్ అని హింట్ కూడా ఇస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరు ఎన్టీఆర్ లెగసీని ముందుకు తీసుకెల్తారనేది ఇప్పుడు చెప్పలేం. ప్రస్తుతం ఎన్టీఆర్ 29వ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో 31 మూవీ ఫిక్స్ అయిపోయింది. ఇక 32వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉండే అవకాశం ఉంది.