అఫీషియల్: బన్నీ నెక్స్ట్ 6 సినిమాలు ఇవే..!
నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పుష్ప మొదటి భాగం పూర్తి అయిన తర్వాత ఐకాన్ సినిమా ప్రారంభించనున్నారని సమాచారం. ఐకాన్ సినిమా పూర్తి చేసిన తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ కలసి పుష్ప సినిమా రెండవ భాగం పూర్తి చేస్తారు. ఇక ఆ తర్వాత బన్నీ వరుసగా మురుగదాస్, బోయపాటి శ్రీను, కొరటాల శివ లతో కలసి తన తదుపరి 3 సినిమాలు పూర్తి చేయనున్నారని సమాచారం. అయితే బన్నీ భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఏ సినిమా ముందుగా ప్రారంభించాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐదుగురు దిగ్గజ దర్శకులతో కలిసి వైవిధ్యమైన సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ సిద్ధం కావడంతో అభిమానులు అమితమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బన్నీ ఎటువంటి కథలతో తమను అలరించడానికి రెడీ అవుతున్నారో తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అధికారికంగా సినిమాలు ప్రకటించారు కానీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే బన్నీ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒకేసారి 6 సినిమాలు లైన్ లో పెట్టి బన్నీ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు.