జయసుధ సహజ నటిగా పేరుపొందిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈమె అసలు పేరు సుజాత.
జయసుధ 1959
డిసెంబర్ 17వ తేదీన చెన్నైలో జన్మించారు. అయితే ఈమె పుట్టి పెరిగింది చెన్నైలో అయినప్పటికీ, మాతృభాష మాత్రం మన తెలుగు భాషే. ఘట్టమనేని
కృష్ణ గారి సతీమణి నటి అలాగే
నిర్మాత అయిన విజయనిర్మల గారు జయసుధకు స్వయాన మేనత్త. ఇక ఈమె ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జయసుధ. అలా మొట్టమొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన పండంటి కాపురం చిత్రం ద్వారా అడుగుపెట్టింది.
ఈమె ఎన్నో చిత్రాలలో ఆదర్శ గృహిణిగా నటిం,చి అందరి చేత మన్ననలు పొందింది. ఈమె తెలుగు, మలయాళం,
హిందీ ,కన్నడ ,తమిళ్ భాషలలో కలుపుకొని ఏకంగా 300 చిత్రాలకు పైగా నటించి, అందరి చేత ప్రశంసలు పొందింది. ఇక దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో 25 సినిమాలు చేయగా,
దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించి సంచలనం సృష్టించింది. అంతే కాదు ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే , కేవలం ఒకే సంవత్సరంలోనే ఈమె నటించిన 25 సినిమాలు విడుదలయ్యాయి. అప్పట్లోనే ఈమె రికార్డులు తిరగరాసింది.
ఇదిలా ఉండగా, ఎప్పుడూ సహజ నటిగా పేరుపొందిన
జయసుధ గారు ఒక సినిమాలో వేశ్య పాత్రలో నటించి, అందరి చేత మన్ననలు పొందడమే కాకుండా పురస్కారాలు కూడా అందుకున్నారు. అంతేకాదు ఈమె ఒక సందర్భంలో ఏం చెప్పింది అంటే.. "దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో వచ్చే సినిమాలో వేశ్య పాత్ర అయినా సరే నేను చేయడానికి సిద్ధం".. అంటూ ఆమె మీడియాతో తమ అభిప్రాయాన్ని వెల్లడించిందట. అంటే
దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో చేయడం అంటే ఆమెకు ఎంత ఇష్టమో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అనుకున్న విధంగానే 1981 వ సంవత్సరంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ,నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రేమాభిషేకం. ఈ సినిమాలో ఆమె ఒక వేశ్య పాత్రలో అద్భుతంగా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.