హరీష్ శంకర్ పవన్ మూవీ ఫస్ట్ లుక్ ను శాసించబోతున్న ఆ సెంటిమెంట్ !

Seetha Sailaja
సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాల నుండి క్లియరెన్స్ రాగానే పవన్ కళ్యాణ్  వెంటనే రంగంలోకి దిగడానికి ఇప్పటికే మానసికంగా సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్  దశలో ఉన్న ‘అయ్యప్పన్ కోషియం’   ‘హరి హర వీరమల్లు’ మూవీల షూటింగ్ లను పరుగులు తీయిస్తూనే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే మూవీ షూటింగ్ ను ఆగష్టు 15న ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం పై అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే  ఈ మూవీకి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా జరిగిన పరిస్థితులలో ఈ మూవీ  మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.  

ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేయడమే కాకుండా ఆల్రెడీ ఫస్ట్ లుక్ డిజైన్ కూడా రెడీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ లుక్  స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి విడుదల అయిన అధికారిక ప్రకనలో  ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష  గులాబీ పువ్వును పెట్టి ఈ సినిమాపై ఆసక్తిని  హరీష్ శంకర్ కలిగించిన విషయం తెలిసిందే.  

దీనిని బట్టి ఈ మూవీలో  దేశభక్తి షేడ్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15న  విడుదల కాబోయే ఈ టైటిల్ కు సంబందించిన ఫస్ట్ లుక్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు పెంచాలని ఇప్పటి నుంచే హరీష్ శంకర్  పక్క వ్యూహాలలో ఉన్నట్లు  తెలుస్తోంది. 2023 శంక్రంతి టార్గెట్ గా ఈ మూవీని విడుదల చేస్తారని అంటున్నారు. పవన్ కెరియర్ లోనే భారీ బ్లాక్ బష్టర్ గా ఈ ఉంటుందని ఇప్పటి  నుంచే అభిమానులు కలలు కంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: