నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ కుటుంబానికి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుండి నేటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వరకు సినిమానే జీవితంగా కొనసాగిస్తున్నారు. సినిమా అన్నా, కళామతల్లి అన్నా ఈ కుటుంబానికి ప్రాణం కన్నా ఎక్కువే. ఈ కుటుంబంలోని నటులంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు పిచ్చి అని చెప్పాలి. ఈ కుటుంబం నుండి వచ్చే ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆయన నటనను పుణికి పుచ్చుకున్న బరు నందమూరి బాలకృష్ణ. అప్పట్లోనే నాన్న గారితో కొన్ని సినిమాల్లో నటించారు. బాలకృష్ణ మొదటి సినిమా 1974 లో వచ్చిన "తాతమ్మ కల". ఇందులో బాలకృష్ణ బాల నటుడిగా నటించారు.
ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు 107 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు తమ నటనా వైభవాన్ని చూపించి అలరించారు. ఈ సినిమాలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఒక్క పాత్రని కాదు ప్రతి పాత్రలో నటించి నటనలో తమకి తామే సాటి అని నిరూపించుకున్నారు. బాలయ్య సాగిస్తున్న ఈ 47 సంవత్సరాల సినీ ప్రయాణంలో కొన్ని అవార్డులను సొంతం చేసుకున్నాడు. అవేమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము.
* బాలయ్య తను నటించిన మొదటి సినిమా "తాతమ్మ కల" కు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు పొందాడు.
* బాలకృష్ణ నటించిన బైరవద్వీపం సినిమా ఇప్పుడు చూసినా ఎంతో గమ్మత్తుగా, అధ్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో తనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.
* బాలయ్య చేసిన నరసింహనాయుడు, సింహ మరియు లెజెండ్ చిత్రాలు ఎంతటి ప్రభంజనం సృష్టిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూడు సినిమాలకు బాలకృష్ణ ఉత్తమ నటుడి విభాగంలో నంది అవార్డులను గెలుచుకున్నారు. అలాగే తాను నటించిన పాండురంగడు, శ్రీరామరాజ్యం చిత్రాలకు ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు దక్కింది.
* బాలకృష్ణను "అక్కినేని అభినయ" అవార్డుతో తెలుగు సినీ పరిశ్రమ గౌరవించింది.
ఇలా పలు రకాల అవార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతే కాకుండా నిజ జీవితంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ హిందూపూర్ నియోజక ప్రజలకు సేవలను అందిస్తున్నాడు. ఈ రోజు నందమూరి బాలయ్య 61 వ పుట్టినరోజు కావడం విశేషం. ఈయన నిందు నూరేళ్ళు చల్లగా బ్రతకాలని ఆశిద్దాం.