బుల్లితెర రాములమ్మగా ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీ ముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షోతో అభిమానులను పెంచుకున్న ఈ భామ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ డబుల్ అవ్వడమే కాదు, అవకాశాలు కూడా అదే తరహాలో వచ్చాయి. కానీ ఎక్కువగా స్పెషల్ ఈవెంట్ లకు మాత్రమే పరిమితం అవ్వడం తో ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు. కానీ అందిన అవకాశాలను వినియోగించుకుని తన టాలెంట్ తో ప్రేక్షకులను 100 శాతం ఎంటర్ టైన్మెంట్ చేస్తోంది ఈ భామ. ఈ మధ్య ఫోటో షూట్ లలో గ్లామర్ డోసు కూడా అమాంతం పెంచేసి కుర్రకారును పరుగులు తీయిస్తోంది.
అయితే అందం, అభినయం మరియు చక్కటి నటన కనబరచగల ఈ ముద్దుగుమ్మ ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. నేను శైలజ, జెంటిల్మెన్, పార్టీ వంటి పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో తొలి దశలో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్ గా కనిపించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు ఒకరు ఈమెకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్లంటే తమిళ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఇప్పుడు అదే క్వాలిఫికేషన్ తో శ్రీముఖి కెరియర్ కి కొత్త అందం వచ్చేలా ఉంది.
కాస్త బొద్దుగా, ఎంతో అల్లరి చేస్తూ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే శ్రీ ముఖి తాజా ఫోటో షూట్స్ చూసి తన సినిమాలో శ్రీ ముఖికి హీరోయిన్ గా చాన్స్ ఇవ్వబోతున్నారట ఓ ప్రముఖ తమిళ దర్శకుడు. ఇప్పటికే ఆ డైరెక్టర్ నుండి మన రాములమ్మకు ఫోన్ రావడం. ఆ వార్త విన్న ఈ బ్యూటీ ఎగిరి గంతేసి మరీ ఒప్పుకోవడం కూడా జరిగిందట . అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే శ్రీముఖి లేదా అటు తమిళ దర్శకుడు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడక తప్పదు.