రకుల్ ప్రీత్ యోగ సూత్ర!
ఆ తర్వాత చికిత్సతో కోలుకున్న ఈ బ్యూటీ తనకు ఎదురైన తీవ్ర ఒత్తిడి గురించి ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు పంచుకుని కరోనా మహమ్మారీ భయం నిద్ర పట్టనివ్వదు అని కామెంట్ చేసింది. చెపుతూ అలాంటప్పుడు దాని నుంచి బయట పడాలంటే ఖచ్ఛితంగా యోగా నిద్రను ఆశ్రయించాలని రకుల్ చెపుతోంది.
తనకు కరోనా వచ్చినప్పుడు తాను నిదురలేమిని ఎదుర్కొన్నానని దాని నుంచి బయటపడేందుకు తన యోగా శిక్షకుడి సలహాలు తీసుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంది. కరోనా నుంచి తేరుకున్నాక కూడ రకుల్ కు చెప్పుకోతగ్గ అవకాశాలు రాకపోవడంతో ఆమె ప్రస్తుతం బొమ్మలు వేసే మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో చాలామంది కరోనా మహమ్మారికి సంబంధించిన ఒత్తిడి ఆందోళనలో ఉన్న పరిస్థితులలో ఆమె ప్రజలకు ఒక పరిష్కారం అందించే ప్రయత్నం చేసింది. ``నేను నిద్రపోలేని ఒత్తిడితో ఉన్నప్పుడు యోగా నిద్ర సెషన్ తో వ్యాయామానంతరం నేను ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటాను. నా వెల్నెస్ నిపుణుడు మున్మున్ గనేరివాల్ సూచించినట్లు చేస్తాను.
మహమ్మారి ఆందోళన మనలల్ని నిద్రలేనివాళ్లుగా చేస్తుంది. అందుకే కరోనా నుండి ఎవరైనా త్వరగా కోలుకోవాలి అంటే యోగా నిద్రకు రెడీగా ఉండడి అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం రకుల్ అజయ్ దేవ్ గన్ తో ‘మేడే’ లో కథానాయికగా నటిస్తోంది. క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీతో తనకు మళ్ళీ టాలీవుడ్ లో బ్రేక్ వస్తుంది అని ఆశ పడుతున్న ఈ బ్యూటీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి..