నితిన్ భారీ బడ్జెట్ సినిమా ఆ హీరో వల్లే ఆగిందా ?

VAMSI
యంగ్ హీరో నితిన్ ఎన్నో  ఆశలు పెట్టుకున్న సినిమా కాస్త ఆశగానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశించిన ఫలితం రాక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్  ఈ సినిమా పై నమ్మకం పెట్టుకోగా అదికాస్తా చేజారినట్లు తెలుస్తోంది . వివరాల్లోకి వెళితే ఇటీవలే నితిన్ నుండి వచ్చిన చెక్ మరియు రంగ్ దే  చిత్రాలు ఆశించిన ఫలితాలను అందించ లేదన్న విషయం తెలిసిందే. చెక్ చిత్రం హిట్ కి చెక్ పెట్టి డిజాస్టర్ గా మిగలగా, ఆ తర్వాత రంగ్ దే మూవీ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. దాంతో నితిన్ తదుపరి ప్రాజెక్ట్ ల పై ఫుల్ ఫోకస్ పెట్టారు.  ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ  ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్  రీమేక్ మాస్ట్రోలో నటిస్తుండగా, తదుపరి డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ మూవీకి "పవర్ పేట" అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. భారీ బడ్జెట్ తో కూడుకున్న ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని భావించారు. అయితే హఠాత్తుగా ఈ సినిమాని హీరో నితిన్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే పవర్ పేట సినిమా కథ శర్వానంద్ నటిస్తున్న మహాసముద్రం సినిమా కథకి చాలా దగ్గర పోలికలు  ఉన్నాయట, దాంతో కాపీ అనిపించే చాన్స్ ఉండడంతో  ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లభించకపోవచ్చన భావించి పవర్ పేట సినిమాని స్వయంగా నితినే పరస్పర అనుసంధానంతో కాన్సిల్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక రెండో వైపు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కరోనా సమయంలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి విడుదల చేయడం ఒక ప్రయోగమే అవుతుంది.

పైగా ప్రస్తుతం వైరస్ కారణంగా పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో భారీ ప్రాజెక్ట్ అందులోనూ రెండు పార్ట్ లు అంటే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పలువురు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ కారణాల చేత డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్ట్ విషయంలో బ్యాక్ స్టెప్ వేసినట్లు చెబుతున్నారు.  అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హీరో నితిన్ లేదా దర్శకుడు కృష్ణ చైతన్య  అధికారిక ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ రాదు. ఈ విధంగా నితిన్ సినిమా అగిపవడానికి శర్వానంద్ కారణమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: