మిల్క్ బ్యూటీకి బాధేస్తే ఏమి చేస్తుందంటే..?
ఈ ఇద్దరికి మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉందట. ఈ విషయాన్నీ స్వయంగా మిల్కీ బ్యూటీ తమన్నానే తెలిపింది.సినిమాల్లో హీరోయిన్స్ కి మధ్య ఎలాంటి కాంపిటేషన్ ఉంటుందో మనకి తెలిసిందే. కానీ ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం అవేమి పట్టించుకోకుండా చాలా సంవత్సరాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారట.ఇద్దరు కూడా వ్యక్తిగతంగా చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో శృతితో మీకున్న స్నేహం గురించి చెప్పమని యాంకర్ అడిగిన ప్రశ్నకు తమన్నా తన స్నేహితురాలు అయిన శృతి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఆ విశేషాలేంటో చూద్దాం.
తమన్నాకి ఎప్పుడైనా బాధ అనిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది శృతియెనని అంటుంది. వెంటనే తన బాధని షేర్ చేసుకోవడానికి శృతికి కాల్ చేస్తా అని చెప్పుకొచ్చింది. అలాగే తమన్నాకి ఎంతగానో స్ఫూర్తినిచ్చినది కూడా శృతి యెనని మిల్కీ బ్యూటీ చెప్పింది. శృతిలో నచ్చేది ఏంటంటే ఎంత బాధలో ఉన్నాగాని తను ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతుంది. అసలు అలా ఎలా? ఎప్పుడు కూడా అంతా యాక్టీవ్ గా ఉంటావని శృతిని అడుగుతూ ఉంటా అని, తనలా ఎప్పుడు ఉత్సాహంగా ఉండటం చాలా కష్టమైన పని అని శృతి గురించి చెప్పుకొచ్చింది. అలాగే తన ఇంటిని పూర్తిగా శ్రుతినే చూసుకుంటుందని, ఇంటిని అనుకూలంగా తీర్చిదిద్దుకుంటూ తన కెరీర్ ను ఒంటరిగా ఉంటూ కష్టపడి కొనసాగిస్తుంటుంది అని తెలిపింది.ఒక పక్క సినిమాల్లో నటిస్తునే అదే సమయంలో శ్రుతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చడిస్తూ ఉంటుంది. చాలా హుషారుగా, సరదాగా మాట్లాడుతుంది. తనలా సరదాగా ఉండటం అందరికి చేతకాదు. అందుకే శృతిని స్ఫూర్తి దాయకంగా తీసుకుంటాను అని తమన్నా తెలిపింది. వీళ్ళ స్నేహం ఇలాగే కొనసాగాలని మనం కూడా కోరుకుందాం. !