అరియానా కు గాడ్ ఫాదర్ గా మారిన రామ్ గోపాల్ వర్మ !
వర్మ తీసే సినిమాలు ఎప్పుడు ఎదో ఒక వివాదానికి చిరునామాగా ఉంటాయి కాబట్టి అతడి సినిమాలలో నటించే వారికి కూడ పేరు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వర్మ ‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా కు కావాల్సినంత ప్రమోషన్ ఇవ్వడానికి తనవంతు సహాయం చేస్తున్నాడు. వాస్తవానికి ‘బిగ్ బాస్’ ఇంటికి వెళ్లకముందు అరియానా ఒక ఇంటర్వ్యూ కోసం ఆర్జీవీని కలిసిన విషయం తెలిసిందే.
ఈమధ్య వర్మను ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా ఒక జిమ్ లోకలిసిందట. అయితే ఆసమయంలో ఆర్జీవీ జిమ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడట. తాను జిమ్ చేయడమే కాకుండా అరియానాకు తన బాడీ షేప్ లో ఉండాలి అంటే ఎలాంటి కసరత్తులు చేయాలో స్వయంగా వివరిస్తూ దానికి సంబంధించిన ఒక ఫోటోను వర్మ సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోను చూసిన నెటిజన్ లు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వర్మ హీరోగా మారుతున్నాడు అన్నప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో వర్మ అరియానా పై చూపిస్తున్న శ్రద్ధను గమనిస్తే వర్మకు హీరోయిన్ దొరికినట్లే అంటూ జోక్ చేస్తున్నారు..