టాలీవుడ్ టాప్ 10 హీరోల భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా.. ?

Mamatha Reddy
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రేక్షకుడు హీరోల సంపాదన, హీరోల కెరీర్, వారి సంపాదన, గురించే ఆలోచిస్తారు కానీ వారి భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎవరూ ఆలోచించరు. కానీ వారి భర్తల నే మించిన సంపాదన కొంతమంది హీరోల భార్యల సొంతం. భర్తల చాటున భార్యల అనే ట్యాగ్ లైన్ ను పటాపంచలు చేస్తూ కొంతమంది హీరోల భార్యలు తమదైన రంగంలో రాణిస్తూ సంపాదించడంలో భర్తకు పోటీపడుతున్నారు. కొందరైతే ఇప్పటికే భర్తలను బీట్ చేశారు. జాబ్ విషయంలో ఎంత ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తారో కుటుంబం విషయానికి వస్తే అంతే హోమ్ లీ గా ఉంటారు. వారు ఎవరు ఇప్పుడు చూద్దాం..
రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఛారిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి పాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు ఆమె ఏడాది సంపాదన చరణ్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఉంటుంది. మహేష్ బాబు కు సంబంధించిన యాడ్ అగ్రిమెంట్ ఏఎంబి మూవీస్ నిర్వహణతో పాటు రీసెంట్ గా స్టార్ట్ చేసినా ది హంబుల్ గో కూడా నమ్రత నే డీల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ వ్యవహారాన్ని కూడా ఆమె చూసుకుంటుంది.
రీసెంట్ గా పిక్ ఏ బూ అనే ఒక సెలబ్రిటీ ఫోటోగ్రఫీ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది. నాని సతీమణి అంజనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆర్కా మీడియా లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఉంది. సమంత కి డబ్బింగ్ చెప్పేది ఈమె. అల్లరి నరేష్ సతీమణి నిరూప హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఈవెంట్ మేనేజర్. రాజీవ్ కనకాల భార్య సుమ బుల్లితెర యాంకర్ గా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: