వయసు గురించి నెటిజన్ ప్రశ్న.. దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన హీరోయిన్?

praveen
సాధారణంగా ఒకప్పుడైతే సినీ నటులకు అటు ప్రేక్షకులకు మధ్య ఎంతో దూరం ఉండేది. అందుకే ఎప్పుడైనా ఇక సినీ నటులు కనిపించారు అంటే మైమరచి పోయేవారు ప్రేక్షకులు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని అటు సినిమా ఇండస్ట్రీలోనే నటీనటులు ప్రేక్షకుల మధ్య దూరం తగ్గి పోయింది. సినీ నటులు ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించడం లాంటివి చేస్తున్నారు.  అంతేకాకుండా వివిధ రకాల ఫోటో లతో ఎప్పడికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 ఇకపోతే కొన్ని కొన్ని సార్లు చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న  సమయంలో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక్కడ ఒక హీరోయిన్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మలయాళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది నటి వర్ష బొల్లమ్మ. ఇప్పటికే తన అందంతో యువత మనసులని దోచుకుంది. తన క్యూట్ స్మైల్ తో ఎంతో మందిని కట్టిపడేసింది. చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్  ఎంట్రీ ఇచ్చింది  ఈ ముద్దుగుమ్మ.

 అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన అభిమానులతో ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ఇలాగే తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్  ఈ హీరోయిన్ ని తన వయసు గురించి ప్రశ్నించాడు.. మీ వయసు 25 ఏళ్లు అని గూగుల్ చూపిస్తుందని ఇది నిజమేనా అంటూ అడిగాడు. ఈ క్రమంలోనే వెరైటీ ఎక్స్ ప్రెషన్ తో ఉన్నా ఫోటో షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నేను మామూలుగా 96 లో పుట్టాను.. నాకు 24 ఏళ్ళు ఉండాలి.. కానీ నాకు తెలిసి నా వయస్సు అమ్మ కంటే గూగుల్ కి ఎక్కువ తెలిసి ఉండాలి అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో నెటిజెన్ షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: