దివంగత నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గురించి ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతా చెప్పుకుంటారు. అంతలా తన నటనతో నాయకత్వ పటిమతో ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పరంపర కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. జయలలిత జీవితానికి సంబంధించిన కథను కూడా సినిమాగా తీయడానికి సంకల్పించారు. ఈ కథకు తలైవి అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈమె దాదాపుగా తెలుగు తమిళ భాషల్లో 140 పైచిలుకు చిత్రాల్లో నటించింది. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రజల చేత జయజయద్వానాలు పలికించుకున్నారు.
ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ గా పేరొందిన కంగనా రనౌత్ నటించారు. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్ అభిమానుల మనసును గెలుచుకుంది. ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదల కావాల్సిన సమయంలో కరోనా మహమ్మారి శనిలా దాపరించింది. ఈ కారణంగా షూటింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా బృందాలు అంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ కరోనా ఎప్పుడు అంతమైపోతుందో తెలియని పరిస్థితి. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డైరెక్టుగా థియేటర్ లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కానీ ఇది అంత సులభంగా జరిగే విషయం కాదు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. కాబట్టి దర్శక నిర్మాతలు విడుదల విషయంలో కంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల కోసం జయలలిత అభిమానులు మరియు కంగనా రనౌత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన అధికారిక సమాచారం ప్రకారం కరోనా జులై ఆఖరుకు కానీ నెమ్మదించేలా లేదు. కాబట్టి ఈ సినిమా జులై ఆఖరున లేదా ఆగష్టు ప్రథమార్ధంలో థియేటర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.