అద్బుత సింగర్ హేమచంద్ర..బర్త్ డే నేడు

Suma Kallamadi
తెలుగులో రిథమిక్ సాంగ్స్ పాడేవారిలో హేమచంద్ర ముందుంటాడు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు, ఒక సంగీత దర్శకుడు హేమచంద్ర. నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. హైదరాబాద్ కు చెందిన హేమచంద్ర 2005 లో జరిగిన "సరిగమప" పాటల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు. హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1988 జూన్ 2 న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో, హైదరాబాద్ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ లో చదువుకున్నాడు, బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తిచేసాడు. ఎన్.సి. కారుణ్య ఇతనికి దగ్గరి బంధువు. గాయకురాలు శ్రావణ భార్గవి తో 2012 డిసెంబరు 9 న హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది, 2013 ఫిబ్రవరి 14 న ఆమెను వివాహమాడాడు. ఇతను తన మొదటి పాట మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కొరకు "నిలువవే" అనే పాటను పాడాడు.

హేమచంద్ర సతీమణి, గాయని శ్రావణ భార్గవి గురించి పరిచయం అవసరంలేదు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. భర్త హేమచంద్రతో కలిసి టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. అంతేకాదు, ఆమె రెండు మూడు పాటలు కూడా రాశారు. ‘సప్తస్వరాలు’ అనే టీవీ షోలో పాల్గొనడం ద్వారా శ్రావణ భార్గవి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన ఆర్పీ పట్నాయక్‌కు శ్రావణ భార్గవి గాత్రం బాగా నచ్చేసింది. దీంతో ఆమెను రమణ గోగులకు ఆర్పీ పరిచయం చేశారు. రమణ గోగుల నిర్మించిన ‘బోణీ’ చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా శ్రావణ భార్గవి కెరీర్ మొదలైంది. అయితే, ‘సింహా’లోని ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ పాట శ్రావణ భార్గవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మధ్యనే శ్రావణ భార్గవి ‘హలో’ యాప్‌లో లైవ్ నిర్వహించారు. ఈ లైవ్ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు పంచుకున్నారు. మంచి ఫోక్ సాంగ్స్ పాడి ఉర్రూతలూగించారు. అయితే, ‘మీ కెరీర్‌లో ఏ పాట పాడినప్పుడు ఇది కొంచెం కష్టం అని అనిపించింది’ అని యాంకర్ అడిగారు. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలోని ‘సూపర్ మచ్చి’ పాట పాడటానికి తాను చాలా కష్టపడ్డానని శ్రావణ భార్గవి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: