బహుబలి పై జోక్ చేసిన విజయేంద్ర ప్రసాద్ !
సాధారణంగా సగటు ప్రేక్షకుడు ధియేటర్లోకి వచ్చిన తరువాత ఆ ధియేటర్ లో ప్రదర్శింప బడుతున్న సినిమా నచ్చకపోతే నిద్రపోయే సందర్భాలు చాల ఉంటాయి. అయితే తెలుగు సినిమా చరిత్రను తారుమారు చేయడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సినిమా చూస్తూ ఏ వ్యక్తి అయినా నిద్రపోయాడు అంటే ఎవరు నమ్మరు.
ఇక దర్శకుడుగా తాను ఫెయిల్ అయిన విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు చాల బాధగా ఉంటుంది అని చెపుతూ తాను సినిమాలకు దర్శకుడుగా పనికిరానని తన కొడుకు రాజమౌళి అన్నప్పుడు తనకు బాధ కంటే కసి పెరిగిందని ఎప్పుడో ఒకప్పుడు తాను ఒక బ్లాక్ బష్టర్ హిట్ తీస్తాను అన్న నమ్మకం తనకు ఉంది అని అంటున్నాడు. ఇక కథ విషయంలో రాజమౌళిని ఒప్పించడం అంత సులువైన పని కాదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే అతడు ఈ స్థాయికి ఎదిగాడు అంటూ జక్కన్న పడే కష్టం అందరికి అర్థం అయ్యేలా వివరించాడు..