ప్రణీత బాటలోనే నడుస్తున్న మెగా హీరోయిన్ !

Divya


సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం ఎలాంటి హంగు  ఆర్బాటం లేకుండా పెళ్లి చేసుకుంటుంటారు. మరి కొంతమందేమో చరిత్రలో మిగిలిపోయే లాగ  ఐదు  రోజుల పెళ్లి అంటూ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక మరికొంతమంది ఎవరికీ తెలియకుండా రహస్యంగా కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రీసెంట్ గా ప్రణీత కూడా చేరింది. గతంలో సినిమా హీరో, హీరోయిన్ ల పెళ్లిళ్లు అంటే చాలా అంగరంగవైభవంగా జరిగేవి. అయితే కోవిడ్ కారణం చేత అనుమతి ఉంటేనే తప్ప పెళ్లి చేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి తీసుకు వచ్చింది కరోనా వైరస్ మనల్ని.

ఈ కారణం చేతనే చాలా మంది సినీ ప్రముఖులు చెప్పకుండానీ పెళ్లి చేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ప్రణీత పెళ్లి చేసుకొని, క్షమించండి అంటూ అభిమానులను సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది ప్రణీత. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ కూడా పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఆ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. అయితే ఇప్పటికే మెహ్రీన్ కౌర్ కూడా పెళ్లికి రెడీ అయింది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ముఖ్యమంత్రి ఇంటికే కోడలిగా వెళుతోంది ఈమె.
 
ఇక ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి లో 7 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ప్రణీత్ లాగే  హీరోయిన్ లావణ్య త్రిపాఠి సైతం పెళ్లి పీటలు ఎక్కబోతోందనే ప్రచారం కూడా  జరుగుతోంది . ఈమె కెరీర్ చాలా డల్ గా నే సాగుతుండడం, అంతే కాక మొన్న వచ్చిన చావు కబురు చల్లగా సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం, ఇక అందుకు తగ్గట్టుగానే సినీ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో లావణ్య త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈమెకు ప్రస్తుతం ముందున్న మార్గం కేవలం పెళ్లి మాత్రమే అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఇంత సడన్ గా ఎలాంటి చడీ చప్పుడు  లేకుండా లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: