భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

Purushottham Vinay
నట శేఖర, సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే ఆల్ టైం సెన్సేషనల్ హీరో అని తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులు గర్వంగా చెప్పుకుంటారు. ఇండియా సినిమా స్థాయిని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత కేవలం సూపర్ స్టార్ కృష్ణ గారికే దక్కుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త ఇంటర్నేషనల్ టెక్నాలజీ లను పరిచయం చేశారు. అలాగే దేశం చూపు మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు తిప్పాడు. హీరోగా ఆయన చేసిన సినిమాలు, ప్రయోగాలు, సేవలు, త్యాగాలు ఇండియాలో ఎవరు చేసుండరు.ఆయన ఫాంలో వున్నప్పుడు మాక్సిమమ్ ఫ్యాన్స్ కలిగిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించారు.


ఇప్పటికి ఎప్పటికి ఆల్ టైం సూపర్ స్టార్ అంటే కృష్ణ గారే అని చెప్పాలి.ఈరోజుతో 78 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ,రాజకీయ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్‌ బాబు కూడా ' 'హ్యాపీ బర్త్‌డే నాన్న.నాకు ఎల్లప్పుడూ ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను' అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు.


ఇక కృష్ణ చిన్న అల్లుడు అయిన సుధీర్ బాబు ఇంట్లో సింపుల్ గా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కృష్ణ గారి సతీమణి ఇందిర గారు, ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు,పెద్ద అల్లుడు గల్లా జయదేవ్,రెండో అల్లుడు సంజయ్,చిన్నల్లుడు సుధీర్ బాబు వంటి వారితో పాటు ఆయన మనవళ్ళు కూడా పాల్గొన్నారు.కుటుంబ సభ్యులంతా కృష్ణ గారి చేత కేక్ కూడా కట్ చేయించారు. ఇక ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: