
జూన్ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న సెలబ్రిటీలు ఎవరంటే...?
హీరో మాధవన్, నిఖిల్, నటి హేమ వీరందరూ కూడా జూన్ 1వ తేదీనే పుట్టినరోజును జరుపుకోనున్నారు.అలాగే వీరితో పాటు జూన్ నెల 1వ తేదీన ఎస్వీ కృష్ణారెడ్డి , ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు కూడా కావడం గమనార్హం..అలాగే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, సంగీత దర్శకులు అయిన మణిరత్నం, ఇళయరాజాలు జూన్ 2 వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఇంకా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా జూన్ 2వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.అలాగే మన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి,ప్రముఖ ప్రఖ్యాత గాన గాంధర్వుడు సింగర్ ఎస్పీ బాలు గారు, నటుడు వేణులు జూన్ 4వ తేదీన పుట్టినరోజులు జరుపుకోనున్నారు.ఇకపోతే ఒకనాటి గ్లామరస్ హీరోయిన్ రంభ జూన్ 5వ తేదీన జన్మించారు.జూన్ 6 వ తేదిన ప్రముఖ దర్శకుడు డాక్టర్ డి. రామానాయుడు జయంతి.అలాగే సీనియర్ హీరోయిన్ సరిత జూన్ 7న పుట్టినరోజును జరుపుకోనున్నారు.ఇకపోతే జూన్ 8 వ తేదిన ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు.
జూన్ 9 అమీషా పటేల్ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఇంకా టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ స్టార్ హీరో పుట్టినరోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ జూన్ 10వ తేదీన జన్మించారు. బాలయ్య పుట్టినరోజుతో పాటు సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.అలాగే జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు కాగా జూన్ 14 బింధుమాధవి పుట్టినరోజు కావడం గమనార్హం.జూన్ 15 దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు.అలాగే జూన్ 16న అంజలి పుట్టినరోజును జరుపుకోనున్నారు.