సరికొత్త రికార్డు సృష్టించిన రామ్ పోతునేని..!
అయితే ఈ సినిమా రామ్ మూవీ కెరీర్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను.. ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్సడ్ టాక్‌ను అందుకున్న ఈ చిత్రం క్రమంగా హిట్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్ అవుతూ ఉంటాయి.
ఇక ఈ సినిమాలను బాలీవుడ్ జనాలు బాగానే ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ ను దక్కించుకున్నాయి. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకూడా ఓ క్రేజీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండటంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. 200 మిలియన్ ఈ సినిమా పూర్తి చేసుకుంది.
అంతేకాదు.. తక్కువ సమయంలోనే 20 కోట్ల వ్యూస్ ను ఈ సినిమా దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.