నెటిజ‌న్‌కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ...?

Suma Kallamadi
అరియానా గ్లోరీ అంటే బిగ్‌బాస్‌కు ముందు పెద్ద‌గా ఎవ‌రికీ ప‌రిచ‌యం లేదు. కానీ బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా ఫేమ‌స్ అయిపోయింది. ఇందులో అవినాష్‌తో ల‌వ్ ఎఫైర్ న‌డ‌ప‌డంతో త్వ‌ర‌గానే అంద‌రి నోట్లో ప‌డింది. ఇక దీని త‌ర్వాత కూడా వీరి జంట‌కు ఏ మాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదు. దీంతో వీరిద్ద‌రూ ఇప్పుడు బుల్లితెర‌పై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
వీరిద్ద‌రూ క‌లిసి చాలా ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. వీరి రొమాన్స్‌కు ప్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో వీరు కూడా రెచ్చిపోయి మ‌రీ రొమాంటిక్ సాంగ్స్‌కు డ్యాన్సులు చేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఉంది ల‌వ్ ఆ లేక ఫ్రెండ్ షిప్ హాఅనేది కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య అరియానాకు ఎదురైన ఓ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూసేయండి.
ఇప్పుడు క‌రోనా సెకండ్ ప్ర‌భావంతో షూటింగ్స్ అన్ని స్తంభించిన విష‌యం తెలిసిందే. దీంతో వెండితెర‌, బుల్లితెర న‌టీన‌టులు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. ఎప్పుడు బిజీబిజీగా ఉండే వీరికి ఇంత ఖాళీ టైమ్ దొరికే స‌రికి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తూ కాల‌క్షేపం పొందుతున్నారు.
ఇదే క్ర‌మంలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ తో కాసేపు ముచ్చ‌టించింది. ఇదే చ‌నువుగా చేసుకున్న ఓ నెటిజ‌న్ వాట్సాప్ నెంబ‌ర్ అడిగారు. దీంతో అరియానా స్పందిస్తూ వాట్సప్ నంబర్ ఇవ్వాలని నాక్కూడా ఉంది.. కానీ ఇవ్వలేను.. ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారు అంటూ చ‌లాకీ స‌మాధానం చెప్పింది. దీంతో వెరీ ఇంట్రెస్టింగ్‌ ఆన్స‌ర్ అంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల్లో రాజ్ త‌రుణ్ తో న‌టిస్తోంది అరియానా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: