
హాట్ టాపిక్ గా మారిన అల్లుఅర్జున్ రామ్ ల ఇంటర్ చేంజ్ గేమ్ !
ఇప్పుడు టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఇదే చర్చ జరుగుతూ రెండు ఆసక్తికర కాంబినేషన్స్ గా మారబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆసక్తి కలిగిస్తున్న ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే గతంలో ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించాడు. మైనస్ 20 డిగ్రీస్ యాక్షన్ అడ్వెంచర్ గా నిర్మంచబోయే ఈమూవీని 2018లో స్రవంతి బ్యానర్ లో ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈమూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈమూవీ కథ రీత్యా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈసినిమాని క్యాన్సిల్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈమూవీకి సంబంధించిన వార్తలు మళ్ళీ మొదలయ్యాయి. అక్కినేని నాగార్జునతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తీయాలని ప్రయత్నిస్తున్న ప్రవీణ్ సత్తారు ఈ లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ కు కథ వినిపించారట స్టోరీ నచ్చడంతో వరుణ్ దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అయితే ఈ కథ అప్పట్లో రామ్ కోసం సిద్ధం చేసిన యాక్షన్ అడ్వెంచర్ కథ ఇప్పుడు వరుణ్ తేజ్ వద్దకు వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా గతంలో తమిళ లింగుస్వామి అల్లు అర్జున్ తో ఒక మూవీ తీయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆకథరామ్ పోతినేని వద్దకు రావడంతో ఈ మూవీకి ఓకె చెప్పడంతో ఈ మూవీని తెలుగు తమిళ భాషలలో నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా రెండు సినిమా కధలు బన్నీ రామ్ చేతుల మధ్య చేతులు మారుతూ ఒక మ్యూజికల్ చైర్ గేమ్ ని తలిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..