వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

Divya

గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్  సినిమా వరుడు. అసలు నిజానికి ఐదు రోజుల పెళ్లి అంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో కేవలం ఒకటి , రెండు రోజుల్లోనే ముగిసే పెళ్లి వేడుకలు, అప్పట్లో ఆనందంఆకాశాన్ని అంటేలా అంగరంగ వైభవంగా ఐదు రోజులు జరుపుకునే వారని చక్కగా చూపించారు. మొత్తానికి భారీ సెట్స్ తో భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్ ప్రొడక్షన్ లో డీ.వీ.వీ.దానయ్య నిర్మించారు.


ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, బాగా హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక డీ వీ వీ దానయ్య దగ్గర ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారు. దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేసి తీసిన ఈ చిత్రాన్ని, అభిషేక్ నామా అంతకంటే ఎక్కువ ధరకు తీసుకొని విడుదల చేశారు. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. బన్నీ కెరియర్ లో ఇలాంటి చిత్రం మరొకటి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం ద్వారా 80 శాతం నష్టపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా వెల్లడించారు.



సాధారణంగా కొందరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో నష్టం వచ్చింది  కదా ! అని మరో సినిమా ఇచ్చి చేసుకోమనే వాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు ఇలాంటి సినిమా తెలిసి కూడా ఎందుకు కొన్నావ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు.. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, టాలీవుడ్ హీరోలలో ముఖ్యంగా మహేష్ బాబు మాత్రమే కొన్ని సినిమాలు లాస్ వస్తే, పిలిచి మరీ డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఇప్పటివరకు ఎవరూ అలా చేయలేదు. మహేష్ బాబు తన సొంత సినిమా కాకపోయినప్పటికీ , నష్టం వస్తే డబ్బు వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు కూడా ఇప్పించేవారు. డిస్ట్రిబ్యూటర్ కి, నిర్మాత కి ఇలా  నష్టం వచ్చింది కదా! అని మనం ఎందుకు హెల్ప్ చేయాలనే హీరోలు ఉన్న ఈ కాలంలో, మహేష్ బాబు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా చాలా మంది హీరోలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు హెల్ప్ చేయాలని కూడా ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: