టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల ప్రస్తుతం మాత్రం ఒక్క ఢీ డబుల్ డోస్ తప్ప మరో సినిమా చేయడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం శ్రీను వైట్ల హవా కొనసాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీను వైట్ల తెరకెక్కించిన దూకుడు, వెంకీ, రెడీ, ఢీ, సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో శ్రీను వైట్ల ఇండస్ట్రీలోనే బిజీ డైరెక్టర్ గా మారిపోయారు. కాగా 2014 లో విడుదలైన ఆగడు సినిమాతో మాత్రం శ్రీను వైట్లకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద వివాదమే రాజుకుంది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు శ్రీనువైట్లకు ఈ చిత్రం షూట్ చేసే సమయంలో వివాదాలు మొదలయ్యాయి. ఏకంగా సినిమా నుండి ప్రకాశ్ రాజ్ ను శ్రీను వైట్ల తీసివేశారు.
ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రకాశ్ రాజ్ తిట్టారని అందువల్లే అతడిని సినిమా నుండి తొలగించామని అన్నారు. ఈ విషయం ఫిల్మ్ ఛాంబర్ వరకూ కూడా వెళ్లింది. దాంతో సినిమా సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ప్రకాశ్ రాజ్ తిరిగి ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరింగింది. ఆ సమయంలో ఒకరినొకరు ప్రెస్ మీట్ లు పెట్టి తిట్టుకున్నారు. మరోవైపు తాను రాసిన డైలాగ్ ను కూడా శ్రీను వైట్ల సినిమాలో వాడుకున్నారని సిగ్గుందా అంటూ కామెంట్లు చేశారు ప్రకాశ్ రాజ్. అయితే ఇదే సినిమా షూటింగ్ సమయంలో కోనవెంకట్ తో కూడా శ్రీను వైట్లకు చెడింది. ఈ విషయంపై కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కొన్ని సినిమాలకు శ్రీను వైట్లతో పనిచేశానని అయితే దూకుడు సమయంలో రైటర్ గా తన పేరుకు బదులు శ్రీనువైట్ల పేరును వేసుకున్నారని అన్నారు.
ఆ తరవాత అతడితో సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యానని కానీ బాద్షా సినిమాకు ఎన్టీఆర్ కారణంగా రైటర్ గా చేశానని చెప్పారు. ఆ తరవాత మాత్రం సినిమా చేయలేదని అన్నారు. తాను పనిచేసిన డైరెక్టర్లందరితోనూ మంచి సంబంధాలున్నాయని కానీ శ్రీను వైట్లతో ఆ సంబంధం లేదని చెప్పారు. మరోవైపు శ్రీను వైట్లకు కొద్దిగా అహంకారం ఉంటుందని అందువల్లే ఆయనకు ఎంతో మంది దూరమవుతారని టాక్ కూడా ఉంది. ఇలాంటి వివాదాల వల్లే ఇప్టటికీ స్టార్ డైరెక్టర్ గా ఉండాల్సిన శ్రీనువైట్ల ఫ్లాప్ డైరెక్టర్ గా మిగిలిపోయారని టాక్ ఉంది.