దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?

Suma Kallamadi
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం - 2 కి రీమేక్. మలయాళం దర్శకుడు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఒరిజినల్ సినిమాలో మోహన్‌లాల్‌, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఐతే తెలుగు చిత్రంలో కూడా హీరోయిన్ గా మీనా నటించనున్నారు. ఈ సినిమాకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్రీమేక్ చిత్రం తో పాటు అసురన్ మూవీకి తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "నారప్ప" గా టైటిల్ ఖరారు చేశారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది కానీ ముందు ఏ సినిమా రిలీజ్ చేయాలన్న విషయం పై గత కొద్ది రోజులుగా సందిగ్ధత నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ సందిగ్ధతకి తెర పడిందని తెలుస్తోంది. వాస్తవానికి మొదట దృశ్యం 2 సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని భావించారు కానీ నిర్మాత సురేష్ బాబు అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు నారప్ప సినిమా థియేటర్లలోనే విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమా విడుదల విషయంలో చిత్రబృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులలో సినిమా విడుదల చేయడం అసాధ్యం కాబట్టి దృశ్యం 2 సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చిందట. ఓటీటీ లో 'దృశ్యం 2' మూవీని విడుదల చేసి.. పరిస్థితులు చక్కబడిన తరువాత థియేటర్లు పూర్తి కెపాసిటీతో తెరుచుకున్నప్పుడు 'నారప్ప' సినిమాను విడుదల చేద్దామని హీరో వెంకటేష్ అభిప్రాయపడ్డారని సమాచారం. నిజానికి “నారప్ప” సినిమాని దృశ్యం-2 రీమేక్ కంటే ముందస్తుగా ప్రారంభించారు. ఈ సినిమానే మొదటగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు సినిమాల టీమ్స్ కొన్ని బిజినెస్ లెక్కలను పరిగణలోకి తీసుకొని “దృశ్యం-2″ చిత్రాన్ని నారప్ప కంటే ముందుగా ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: