బన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??

GVK Writings

టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా మూవీ తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు యువ దర్శకుడు వంశీ పైడిపల్లి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అయితే రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అనంతరం ఎన్టీఆర్ హీరోగా కాజల్, సమంతా లతో తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ బృందావనం తో సూపర్ హిట్ కొట్టి బ్రేక్ అందుకున్న వంశీ పైడిపల్లి, ఆ తరువాత చరణ్, అల్లు అర్జున్ లతో ఎవడు మూవీ తీసి మరొక విజయాన్ని అందుకున్నారు.
ఆపై నాగార్జున, కార్తీ లతో ఆయన తీసిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ఉపిరి కూడా సక్సెస్ కొట్టింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి మూవీ తీసి మరొక బ్లాక్ బస్టర్ కొట్టిన వంశీ ఏకంగా ఆ మూవీతో ఉత్తమ ఎంటర్టైనర్ మూవీ గా జాతీయ అవార్డు కొట్టారు. అయితే ఈ సినిమా తరువాత వంశీ మరొకసారి మహేష్ తో మరొక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవలన అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఇటీవల తమిళ నటుడు విజయ్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపంచిన వంశీ త్వరలో దానిని తెరకెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఆ మూవీ అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వంశీ ఒక భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లని కలిసి ఆ మూవీ స్టోరీ వారికి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న వంశి, త్వరలో దాని పూర్తి స్క్రిప్ట్ మొదలెట్టనున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం పుష్ప రెండు భాగాల సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్, ఆపై ఐకాన్ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం వంశీ మూవీ మొదలు కానుందని, అలానే దీనికి సంబంధించి త్వరలో అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని చెప్తున్నారు ..... !!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: