త్రివిక్రమ్ ఊహాలను అస్తవ్యస్తం చేసిన కరోనా సెకండ్ వేవ్ !

Seetha Sailaja
ప్రస్థుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయిలో మరే టాప్ దర్శకుడు నష్టపోలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో త్రివిక్రమ్ తో సినిమాలు తీయడానికి అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశక్తి కనపరచడమే కాకుండా ఏకంగా అతడికి 15 కోట్ల వరకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

‘అల’ తో తనకు ఏర్పడిన మ్యానియాను జాగ్రత్తగా మలుచుకుంటూ వరసపెట్టి కనీసం రెండు మూడు సినిమాలు చేయాలని త్రివిక్రమ్ అనేక కథలను కూడ సిద్ధం చేసాడు. కరోనా ఫస్ట్ వేవ్ తగ్గి ఆశలు కల్పించి వెంటనే సెకండ్ వేవ్ తారా స్థాయికి చేరుకోవడంతో ఇక ఇప్పట్లో జూనియర్ కు ఖాళీ దొరకదు అని నిశ్చయించుకుని అతడి అంగీకారంతోనే మహేష్ బాబు ప్రాజెక్ట్ వైపు వెళ్ళి ఆతరువాత జూనియర్ తో సినిమాను తీయాలి అనుకున్నాడు అంటారు.


అయితే జరిగింది వేరు జూనియర్ త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడమే కాకుండా ఆతరువాత జూనియర్ కొరటాల ప్రశాంత్ నీల్ సినిమాలకు ఒకే చెప్పడంతో మరో రెండు సంవత్సరాల వరకు జూనియర్ దొరకదు. పోనీ బన్నీ వైపు వెళదాము అని త్రివిక్రమ్ భావిస్తే ఇప్పుడు ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా తీస్తున్న పరిస్థితులలో వచ్చే ఏడాది చివరి వరకు బన్నీ అందుబాటులోకి రాడు.

దీనితో త్రివిక్రమ్ వెంకటేష్ వైపు మళ్ళీ అతడి 75వ సినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం మరి కొన్ని నెలలలో కరోనా థర్డ్ వేవ్ వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో ఉన్న మహేష్ మూవీ షూటింగ్ పూర్తి కావడం మరింత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో శాస్త్రవేత్తలు చెపుతున్న ఊహాగానాల ప్రకారం కరోనా సెకండ్ వేవ్ తగ్గి వెంటనే కొద్ది గ్యాప్ లో మూడవ వేవ్ వస్తే వచ్చే సంవత్సరం చివరి లోపు త్రివిక్రమ్ కు ఒక్క సినిమా చేయడం కూడ కష్టమే అన్న మాటలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: