ఆ హీరోయిన్ కి నెటిజన్ వెరైటీ లవ్ ప్రపోజల్..!
అయితే అను ఇమాన్యుయేల్ ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్‌తో లవ్ ట్రాక్ కొనసాగిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్ తోనూ రూమర్స్ రాని శిరీష్ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్ తో క్లోజ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఈ వార్తపై ఎవరో ఒక్కరు స్పందిస్తే గాని అసలు నిజం ఏంటో తెలీదు.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా లాంగ్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్ చేయగా ఓ నెటిజన్ నుంచి ఊహించని విధంగా రిప్లయ్ వచ్చింది. అయితే అతడు ఏం రిప్లయ్ ఇచ్చాడు చూద్దామా. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్‌తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.