ఎన్టీఆర్ మనోజ్ స్నేహం గురించి ఆసక్తికర విషయాలు..

Purushottham Vinay
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండటం కామన్. మహేష్ బాబుకి కార్తీ, సూర్య అలాగే పవన్ కళ్యాణ్ కి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ప్రభాస్ కి రానా,అల్లు అర్జున్ కి నవదీప్, రామ్ చరణ్ కి రానా,శర్వనంద్ వున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి మంచు మనోజ్ ప్రాణ స్నేహితుడు. చిన్నపటి నుంచి వీరిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇండస్ట్రీలో అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్స్ వీరిద్దరూ.నిజానికి ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ గారు చనిపోయినప్పుడు మంచు మనోజ్ ఎన్టీఆర్ ని వదిలిపెట్టలేదు. అనుక్షణం ఎన్టీఆర్ వెంటే ఉంటూ ఎన్టీఆర్ తోనే గడిపాడు.అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కుటుంబానికి మంచు కుటుంబానికి చాలా మంచి అనుబంధం కూడా వుంది.ఇక ఎన్టీఆర్ మనోజ్ వీరిద్దరూ కూడా 1983వ సంవత్సరం మే 20 వ తేదీనే  జన్మించారు.కొన్ని గంటల ముందు ఎన్టీఆర్ జన్మించాడు.ఎన్టీఆర్, మనోజ్ ఇద్దరూ కూడా సినిమా కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.


ఇక వీరిద్దరి ఎంట్రీ విషయానికి వస్తే..1991లో రూపొందిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ద ఎన్టీఆర్. అలాగే మంచు మనోజ్ కూడా 'మేజర్ చంద్ర కాంత్' సినిమా ద్వారా బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కూడా పెద్ద ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించాడు.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాల్లో నటించడమే కాకుండా ఎంపీగా కూడా చేశారు. మనోజ్ తండ్రి మోహన్ బాబు కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు అలాగే ఈయన కూడా ఎంపీగా చేసాడు.ఎన్టీఆర్ వివాహం 2011వ సంవత్సరం మే నెలలో లక్ష్మీ ప్రణతితో జరిగింది. ఇక మనోజ్ వివాహం 2015 వ సంవత్సరం మే నెలలో జరిగింది. మనోజ్ భార్య పేరు కూడా ప్రణతినే కావడం విశేషం. అయితే కొన్ని కారణాల వల్ల మనోజ్ తన భార్యతో విడిపోయాడు.కాకుంటే ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అయ్యి పెద్ద స్టార్ హీరో అయ్యాడు. మంచు మనోజ్ మాత్రం కథల ఎంపికలో తప్పులు చేస్తూ స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: