తరుణ్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన సినిమా..

Divya


హీరో తరుణ్ 1983 జనవరి 6న హైదరాబాదులో జన్మించాడు. తల్లి కూడా ఒక సినీ నటి . ఆమె ఎవరో కాదు రోజా రమణి. తరుణ్ బాలనటుడిగా మొట్టమొదట 1990లో వచ్చిన అంజలి చిత్రంలో నటించాడు. ఇక ఈ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత బాలనటుడిగా దళపతి ,ఆదిత్య369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాలలో నటించి, ఉత్తమ బాల నటుడిగా గుర్తింపు పొందాడు..

ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రం ద్వారా కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా ఉత్తమ నటుడుగా  గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవి కిషోర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రిచా కూడా హీరోయిన్ గా తొలి పరిచయం అయింది. ఇక మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం, హిందీలో "తుజే మేరీ కసం" అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఇక అక్టోబర్ 13 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయగా, అద్భుతంగా కోటి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి..

ఈ చిత్రాన్ని 1.2 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా, ఏకంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం విజయంతో స్రవంతి రవి కిషోర్ అప్పటివరకు వున్న ఆర్థిక కష్టాలన్ని ఒక్కసారిగా తీరిపోయాయి. సుమారు మూడు కోట్ల మందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో చూసినట్లు అంచనా.


ఇక ఈ చిత్రం ద్వారా  ఫిలింఫేర్ ఉత్తమ నూతన తెలుగు నటుడిగా తరుణ్ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా పురస్కారం కూడా అందుకుంది ఈ చిత్రం. అంతేకాకుండా ఉత్తమ దర్శకుడు అవార్డు, ఉత్తమ తెలుగు నటి అవార్డులను కూడా ఈ చిత్రం అందించింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: